VIDEO: ఆగిరిపల్లిలో దట్టంగా పొగ మంచు

VIDEO: ఆగిరిపల్లిలో దట్టంగా పొగ మంచు

 ELR: ఆగిరిపల్లిలో శుక్రవారం దట్టమైన పొగ మంచు అలుముకుంది. పలు కాలనీలలో పొగ మంచు కారణంగా ఉపాధి కోసం వెళ్లే కార్మికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ నగరానికి వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం వేలాదివాహనాలు సంచరిస్తుంటాయి. దట్టమైన పొగ మంచు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగ మంచులో ప్రయాణం అనారోగ్య హేతువని వైద్యులు హెచ్చరించారు.