సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

KMM: ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో వర్షాల కారణంగా అంతర్గత రోడ్లు బురదమయంగా మారడంతో సీపీఎం ఆధ్వర్యంలో గ్రామ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ బురుద వల్ల దోమలు, ఈగలు పెరిగి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సమస్యతో కూడిన పత్రాలను గ్రామపంచాయతీ కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు.