VIDEO: 'సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి'

W.G: కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భీమారావు కోరారు. సోమవారం తణుకు సత్యనారాయణ స్పిన్పింగ్ మిల్స్ గేటు వద్ద సమావేశం నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌ల వలన 8 గంటలు పని రద్దై 12 గంటలు పని అమలులోకి వస్తుందన్నారు. అన్ని హక్కులు కోల్పోయి కార్మికులు కట్టు బానిసలుగా మారతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.