'గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయింపు'

'గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయింపు'

NLG: నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధియే తన ముఖ్య ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.