గ్రద్దగుంటలో పర్యటించిన ఎమ్మెల్యే

TPT: తడ మండలం గ్రద్ద గుంట పంచాయతీలో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. 'సుపరిపాలన తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా ఆమె గ్రామంలో పర్యటించారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు చెందిన కరపత్రాలు ఇంటింటికి అందజేశారు. అనంతరం స్థానికులు సమస్యలు తెలుసుకుని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.