మాజీ ఎంపీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
ADB: భీంపూర్ మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సోయం బాబురావు, డీసీసీబీ ఛైర్మన్ బోజారెడ్డి సమక్షంలో శుక్రవారం పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.