తండ్రి కళ్ల ముందే కూతురు దుర్మరణం
RR: హయత్‌నగర్ RTC కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఐశ్వర్య ఇవాళ ఉదయం రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తన తండ్రి, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.