ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
BDK: కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈవీఎం గోడౌన్‌ను సందర్శించడం జరిగిందని తెలిపారు.