VIDEO: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

VIDEO: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

WNP: బాల్య వివాహాలుచేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. కొత్తకోట మండలం పాలెం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం జరిపించడం నేరమన్నారు. నివారించే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.