రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు
MNCL: చెన్నూరు సబ్ స్టేషన్‌లో రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్లు SE ఉత్తమ్ జాడే మంగళవారం ప్రకటనలో తెలిపారు. చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్ మండలాల పరిధిలోని వినియోగదారులు బిల్లులు, ఇతర విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు.