కేటీఆర్ తన సొంత చెల్లిని గెంటేశాడు: సీఎం రేవంత్
HYD: మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. దొచుకున్న దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని తన సొంత చెల్లిని బయటకు గెంటేశారని అన్నారు. ఇంట్లో ఆడబిడ్డను సంతోషంగా చూసుకోవు కానీ ఇప్పుడు మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నావా..? అని ఎద్దేవా చేశారు.