నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ: బాలకృష్ణా రెడ్డి
NGKL: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. ఇవాళ నాగర్‌కర్నూల్ రెడ్ క్రాస్ భవనంలో పనులను పరిశీలించి, భవనంలో త్వరలో శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. యువతకు వివిధ వృత్తి కోర్సులు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.