లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

KMM: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. శనివారం కల్లూరు రైతు వేదికలో 112 మంది లబ్ధిదారులకు రూ. 50.85లక్షల విలువైన కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో 22 మందికి కల్యాణలక్ష్మి కింద రూ. 22.02లక్షలు, 90 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 28.82లక్షలు మంజూరు చేశారు.