శివాలయ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామంలో బుధవారం ఉదయం నూతన శివాలయం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పూజలో పాల్గొని, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సత్వర పరిష్కారం హామీ ఇచ్చారు.