చెప్పల్‌బజార్‌లో రోడ్డు తవ్వి వదిలేశారు..!
HYD: చెప్పల్‌బజార్‌లో గత కొంతకాలంగా మంచినీటిలో పొల్యూషన్ నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరించారు. కానీ, తవ్విన రోడ్డును మాత్రం అలానే వదిలేశారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ ఇవాళ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.