ఈనెల 16న ఘనంగా ఆడికృత్తిక మహోత్సవం

అన్నమయ్య: ఈ నెల 16న మదనపల్లెలోని మడికయ్యల శివాలయంలో ఘనంగా ఆడికృత్తిక మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు మురళి స్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వాములకు ఆడికృత్తిక రోజున శేష అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు.