రేపటి నుంచి అల్లూరులో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

NLR: అల్లూరు మండలంలో ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రజనీకాంత్ పేర్కొన్నారు. 19న ఇస్కపల్లి-1, 20న ఇస్కపల్లి-2 21న వెస్ట్ గోగులపల్లి, 22న ఈస్ట్ గోగులపల్లి 23న నార్త్ ఆములూరు& గ్రద్ద గుంట, 28న బీరంగుంట, బట్ర కాగుళ్లు. 29న పూరిని, 30న ఇందుపూరు సచివాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.