జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు
అన్నమయ్య: దిత్వా తుఫాన్ కారణంగా జిల్లాలో రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థలు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలానే పిల్లలు చెరువులు, కుంటలు, కాలువలు వైపు వెళ్లకుండా ఉండేల జాగ్రత్తలు పాటించలని తల్లిదండ్రులకు అధికారులు సందేశాలు పంపాలని కోరారు.