నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో వరద ప్రవాహంన

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. 22 గేట్లు ఎత్తి 1.69 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 586.40 అడుగులు, నిల్వ 302.39 టీఎంసీలుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్ జలాశయ పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.