రైతులకు ఎరువులపై అవగాహన సదస్సు

రైతులకు ఎరువులపై అవగాహన సదస్సు

MDK: చిలిప్‌చేడ్ మండలం సోమక్కపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవో రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులు తగ్గించి, జీవన ఎరువులు వాడాలని సూచించారు. భాస్వరం మోతాదు పెరిగితే భూములు చౌడుబారుతాయని, యూరియాకు బదులుగా సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెస్త దుర్గాచలం, తదితరులు పాల్గొన్నారు.