పుల్లంపేట చెరువు పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
అన్నమయ్య: పుల్లంపేట చెరువు, ఆనకట్టలు, కాలువ పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. అప్పారాజుపేట ఆనకట్ట నుంచి పుల్లంపేట చెరువుకు వచ్చే 4 కిలోమీటర్ల కాలువలో పూడిక తొలగింపుపై AEE నాగేంద్ర నాయక్ కలెక్టర్‌కు వివరించారు. తక్కువ ఖర్చుతో చెరువులకు నీరు వచ్చే మార్గాలను పునరుద్ధరించాలని కలెక్టర్ ఆదేశించారు.