అకాల వర్షం.. మామిడి రైతుకు నష్టం
MDK: కోహీర్ మండలంలో శనివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులకు మామిడి తోటలో మామిడికాయలు నేలరాయాయి. చెరుకు, మొక్కజొన్న, బొప్పాయి, వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో కొంతసేపు అంతరాయం ఏర్పడింది.