NZ vs WI: న్యూజిలాండ్‌దే మూడో టీ20

NZ vs WI: న్యూజిలాండ్‌దే మూడో టీ20

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో కివీస్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 177/9 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 168 పరుగులకు ఆలౌటైంది. రొమారియో షెపర్డ్ (49) పోరాటం వృథా అయింది.