ఈ నెల 7 వరకు విద్యాసంస్థలకు సెలవులు

ఈ నెల 7 వరకు విద్యాసంస్థలకు సెలవులు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో జమ్మూకశ్మీర్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.