VIDEO: జిల్లాలో వడగండ్ల వర్షం
మార్కాపురం జిల్లాలో నిన్న సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. కనిగిరి మండలం గుడిపాడు పంచాయతీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పెద్ద పెద్ద రాళ్ల వంటి వడగండ్లు పడటంతో ఇళ్లపై ఉన్న సిమెంట్ రేకులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్పమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఎండ కాలంలో ఇలాంటి వర్షాలు ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.