జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ

జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను  తనిఖీ చేసిన సీఐ

ప్రకాశం: జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సీఐ హాజరతయ్య ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని విధి నిర్వహణను ఆయన సమగ్రంగా పరిశీలించారు. కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, రికార్డు నిర్వహణ విధానాలపై సిబ్బందితో చర్చించారు. అనంతరం స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.