అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
PLD: క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరై, స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మహిళా నాయకురాలు వేగుంట రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.