వినాయక చవితిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

HYD: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో దెబ్బతిన్న క్యాచ్ పిట్‌లు, మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన 11,741 పాట్ హోల్స్‌లో 8,330 మరమ్మతులు పూర్తి చేశామన్నారు.