'ఇంటి స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటం తప్పదు'

MHBD: అర్హులైన నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో భూ పోరాటాలు మరోమారు తప్పని సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అజయ్ సారధి రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన నేడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు సీపీఐ పార్టీ మండల కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.