అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి వేడుకలు

అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి వేడుకలు

RR: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో పూజలు, అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వర్షం నుంచి రక్షణగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.