ఇసుక పంపిణీ సజావుగా చేయాలి: ఆర్డీఓ

ATP: ఇసుక పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా సజావుగా పంపిణీ చేయాలని ధర్మవరం ఆర్డీఓ వెంకటరామిరెడ్డికి సిబ్బందికి సూచించారు. మంగళవారం బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి ఇసుక డంపింగ్ యార్డ్‌ను ఆర్డీఓ, తహసీల్దారు శివ శంకర్ నాయక్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు టన్ను ఇసుకను రూ. 277లకు విక్రయిస్తున్నట్లు చెప్పారు.