ధర్మారంలో వినూత్నంగా వార్డు సభ్యుడు గెలుపు
BHNG: అడ్డగూడూర్ మండలం ధర్మారం గ్రామంలో ఒకటో వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కప్పల గోపి బరిలో ఉన్నారు. అయితే వార్డులోని మొత్తం 119 ఓట్లకు ఆయనకు 118 ఓట్లు పోలయ్యాయి. ఒక్కరు తప్ప అందరూ ఆయనకే ఓటేశారు. ఉమ్మడి నల్గొండ చరిత్రలో ఏ అభ్యర్థి సాధించని వినూత్న విజయాన్ని గోపి అందుకున్నారని గ్రామస్థులు అభినందిస్తున్నారు.