పరిగిలో దంచికొడుతోన్న ఎండలు
VKB: పరిగి నియోజకవర్గంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం రాకముందే సూర్యుడు భగ్గుమంటున్నాడు. శనివారం ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం పరిగిలో గరిష్ట ఉష్ణోగ్రత 39°C దాటుతోంది. వేసవి కాలం మొదలవడంతో ప్రజలు చల్లదనం కోసం ఏసీలు, కూలర్లను వాడుకుంటున్నారు.