గ్రామాలలో సోషల్ మొబిలైజేషన్

KMR: భిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం సాయంత్రం ఐకేపీ కార్యాలయ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోషల్ మోబిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో వృద్ధులు, కిశోర బాలికలు, వికలాంగులను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.