'ఘనంగా పౌష్టికాహార మసోత్సవాలు'

SKLM: పాత బగ్గాం అంగన్వాడి కేంద్రం-1లో పౌష్టికాహార మసోత్సవాలుల్లో భాగంగా మంగళవారం స్టాల్స్ నిర్వహించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను గురించి వివరించారు. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవలసిన ఆహార పదార్థాలను వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత వివరించారు.నాయకులు, అధికార యంత్రాంగం పాల్గొన్నారు.