భారత సైన్యం పట్ల గర్వంగా ఉంది: రాహుల్

ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జైహింద్ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. భారత సైన్యం పట్ల గర్వంగా ఉందన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్థరాత్రి దాడులు చేయగా 30 మంది ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.