VIDEO: శవం వద్ద నగలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు

VIDEO: శవం వద్ద నగలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు

JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బుధవారం జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చెవులకు ఉన్న బంగారు కమ్మలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందే కమ్మలు తీసేశారని ఆరోపిస్తూ అక్కడ ఆందోళనకు దిగారు.