పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు

పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు

VZM: రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాటిని నియంత్రించేందుకు పోలీసులు నడుంబిగించారు. అందులో భాగంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో పలుచోట్ల ముందుస్తు హెచ్చరిక బోర్డులను సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి నాయుడు సంయుక్తంగా ఆదివారం ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో కుటుంబాన్ని చిత్తు చేయొద్దని, శిరస్త్రాణం ధరించండి, ఇంటికి క్షేమంగా చేరండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.