హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
NLR: 8వ ఏడీఏ కోర్టు అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామంలో 2014లో పంచాయతీ కులాయి వద్ద జరిగిన సింగమల రమణమ్మ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏడుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 5000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. శిక్ష పడిన వారిలో రత్నయ్య, మద్దినబోయిన వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, కేసరి వెంకటేశ్వర్లు ఉన్నారు.