26న నెల్లూరు మేయర్ ఎన్నిక

26న నెల్లూరు మేయర్ ఎన్నిక

NLR: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 26న నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరగనుందని ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం గిరిజన మహిళా అభ్యర్థి మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారని ఆయన వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతాయన్నారు.