సీఎంను కలిసిన ఉపాధ్యాయ సంఘం నేతలు

నిర్మల్: గతంలో నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను వెంటనే కొనసాగించాలని కోరుతూ గురువారం నిర్మల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులను వెంటనే చేపట్టాలని విన్నవించారు. సీఎంను కలిసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ ఉన్నారు.