VIDEO: రాజంపేటలో భారీ వర్షం
అన్నమయ్య: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాజంపేట ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం వర్షం తీవ్రత పెరిగింది. దీంతో పుల్లంపేటలోని పుల్లంగేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలి చెరువుకు నీరు చేరుతోంది. నిరంతర వర్షం కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడ్డారు.