రోడ్డు బాగు చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి
NLG: చింతపల్లి మండలం ఉప్పరపల్లిలో తుంగపాడు వెళ్లే రహదారిలో ఉన్న వైకుంఠధామం వరకు దారి మొత్తం గుంతల మయంగా, బురద మయంగా మారిందని గ్రామస్థులు బుధవారం తెలిపారు. ఈ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ ప్రత్యేక అధికారికి, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు.