పెదపారుపూడిలోని షాపులను తనిఖీ చేసిన అధికారులు

పెదపారుపూడిలోని షాపులను తనిఖీ చేసిన అధికారులు

కృష్ణా: పెదపారుపూడిలోని గౌరీ ఫైర్ వర్క్స్ సేల్స్, గిడ్డంగిని ఆదివారం తహసీల్దార్ శ్రీను నాయక్, ఎస్సై శ్రీధర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని, షార్ట్ సర్క్యూట్ వంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.