'నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

HNK: జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విచ్చలవిడిగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మర్ క్లాసులు నిర్వహించే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.