VIDEO: జాన్ డియర్ షోరూమ్ వద్ద ఉద్రిక్తత
WGL: వర్ధన్నపేట పట్టణంలోని జాన్ డియర్ ట్రాక్టర్ షోరూమ్ వద్ద శుక్రవారం వరి కోత మిషిన్ యజమాని, షోరూమ్ సిబ్బంది మధ్య వాగ్వాదం తీవ్రమైంది. వివాదం పెరిగి హార్వెస్టర్ యజమాని, అతనితో వచ్చిన మరో ఇద్దరు షోరూమ్‌పై దాడి చేయగా, వర్కర్లు కూడా ప్రతిదాడికి దిగారు. ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.