స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
VKB: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. నిన్న జిల్లా కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.