'సీపీఎం నేతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'

'సీపీఎం నేతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'

ASR: సీపీఎం పార్టీ నేత కే.పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ అరకు మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం రాత్రి అరకులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా, అలాగే అనేక ప్రజా సమస్యలపై పెంచలయ్య పోరాటం చేశారన్నారు. అలాంటి వ్యక్తిని గంజాయి మాఫియా హత్య చేసిందన్నారు.