'మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లు తయారీ'

'మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లు తయారీ'

VKB: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతుంది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన జిల్లా అబ్కారీ అధికారులు ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.