RTC బంపర్ ఆఫర్.. ఈ బస్సుల్లో డిస్కౌంట్

RTC బంపర్ ఆఫర్.. ఈ బస్సుల్లో డిస్కౌంట్

TG: ప్రయాణికుల కోసం RTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. HYD నుంచి ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ రేట్లను తగ్గించింది. HYD నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే లహరి (Non-AC), సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్‌పై 15%, లహరి(AC), రాజధాని(AC) బస్సుల్లో 10% తగ్గిస్తూ నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో.. ఎక్కువ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ తెలిపింది.